సస్పెన్స్ క్రియేట్ చేసిన నీలకంఠ సర్కిల్ - రివ్యూ

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (15:47 IST)
circle movie
నటీనటులు: సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్, నైనా
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని, సంగీతం: NS ప్రసు, నిర్మాతలు: M.V. శరత్ చంద్ర, టి.సుమలత అన్నీత్ రెడ్డి, వేణుబాబు అడ్డగా, దర్శకుడు : నీలకంఠ, ఎడిటర్ : మధు రెడ్డి
 
నీలకంఠ దర్శకత్వం వహించిన సర్కిల్ ఈరోజే విడుదల అయింది. జీవితమే సర్కిల్. అంటూ కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేసేలా కాప్షన్ పెట్టి హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. 
 
కథ:
అర్ధరాత్రిళ్ళు  మర్డర్లు చేసే కాంట్రాక్ట్ కిల్లర్ పుత్తూరు గణేష్ (బాబా భాస్కర్). ఇంకోవైపు ప్రపంచ స్థాయిలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవ్వాలుకునే కైలాష్ (సాయి రోనక్). ఓ రాత్రి ఫుల్గా తాగి తన ప్లాట్ కు వస్తాడు.  అప్పటికే ఇంట్లో ఉన్న కాంట్రాక్ట్ కిల్లర్ పుత్తూరు గణేష్, కైలాష్ పై అటాక్ చేస్తాడు. కానీ బ్రహ్మ ముహూర్తం అని చెప్పి తెల్లవారు 3.30 గంటలు వరకు ఆగుతాడు. ఈ లోపు ఎవరు చంపమని గెస్ చేసి చెపితే ఆఫర్ ఇస్తానంటాడు. అలా అలోచించి  మూడు లవ్ స్టోరీస్ కైలాష్‌ చెపుతాడు. కైలాష్‌కి గతంలో అరుందతి (రిచా పనై), మాళవిక (నయన), హిమానీ రాజ్‌పుత్ (అర్షిన్ మెహతా) అనే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రేమించి వదిలేస్తాడు. వారిలో ఎవరు కైలాష్ ను చంపమని చెప్పారు. ఆతర్వాత  ఏం జరిగింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష:
ఇలాంటి కథలు వినడానికి చాలా థ్రిల్ గా అనిపిస్తాయి. వాటిని తెరపై చూస్తే మరింత థ్రిల్ గా ఉంటుంది. ఆ ప్రయత్నం లో నీలకంఠ చేసిన కొత్త ప్రయోగం. సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు. మూడు కథలకు పాత్రలపరంగా నటీమణులు సరిపోయారు. ఇక సాయి రోనక్ తన చార్మింగ్ లుక్, నటనతో ఆకట్టుకున్నాడు. కెరీర్ పరంగా చూసుకుంటూ ప్రొఫిషన్ కు అద్డంకి కలిగితే దేనికైనా తెగించే పాత్ర రోనాక్ ది . దాని బాగా డిజైన్ చేశారు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌ బాగున్నాయి.
 
ఇప్పటి ట్రెండ్ కు తగినట్లుగా నయన,  సాయి రోనక్ లవ్ ట్రాక్ డీసెంట్, షార్ట్ గా ఉంది. ఈ కథలో ప్రధాన జంట మధ్య రొమాన్స్  లాజికల్ గా మరియు నమ్మే విధంగా ఉంటుంది. పరిమిత పాత్రలో నయన బాగా నటించింది. నార్త్ ఇండియన్ అమ్మాయిగా అర్షిన్ మెహతా ఓకే. రిచా పనై హీరో కి మధ్యలో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. అయితే ఇప్పటి జనరేషన్ లో కొందరు  వన్ నైట్ రొమాన్స్ అన్నట్లు ఉంటున్నారు. వారు కూడా అసలైన లవ్ కలిగితే ఎలాఉంటుందో కూడా చూపించార
 
సినిమా బేస్ పాయింట్ హీరోను ఎలిమినేట్ చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్‌ని ఎవరు నియమించారు అనే దానిపై సినిమా ఉంది. అందుకు గల కారణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుస్తుంది. అదెవరో తెలియడానికి చివరి వరకు సస్పెన్స్ తో ఉండాలి. సినిమా మొత్తం క్లైమాక్స్ మీద ఆధారపడి ఉంది. అదిగూడ సెంటిమెంట్, కర్మ సిద్ధాంతం తో ముగించారు. మనం చేసే పనులే పిల్లలపై ప్రభావం చూపుతాయి అనేది ఫైనల్ పాంట్. దేనికోసం రకరకాలుగా చెప్పారు. ఆ క్రమంలో హీరో ప్రవర్తన కేర్లెస్, తర్వాత పరివర్తన చెందడం జరిగినా ప్రేక్షకుడు ఫీల్ కావడానికి టైం పడుతుంది. 
 
మొదటి పార్ట్ తేలిగ్గా అయింది అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త సినిమా డ్రాగ్ అవుతుంది. ఈ సినిమాలో  బాబా భాస్కర్ భిన్నమైన మేనరిజం తో దర్శకుడు చేయించాడు. అయినా  అందులో లోపాలు ఉన్నాయి.  ఎన్ఎస్ ప్రసు సంగీతం ఒకే. . రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ టీమ్ సెకండాఫ్ ని బాగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
దర్శకుడు నీలకంఠ చిన్న పాయింట్ ను ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేసారు. కానీ ఇంకాస్త కొత్తగా ఉంటె బాగుండేది. ఇప్పటి ట్రెండ్ కు ట్విస్ట్ లు బాగా ఉండాలి. అది చెప్పే విధానం మెరుగ్గా ఉంటె బాగుండేది.  హీరో పాత్రలో యూస్ అండ్ త్రో తరహాలో సాగటంతోఎమోషన్స్ లేని బోరింగ్ లవ్ స్టోరీ లతో సినిమా నిండిపోయింది.  ఇలాంటి సినిమాలు ఓటి.టి. లో ఆసక్తిగా ఉంటాయి.  కథలో ప్రధాన పాయింట్ బాగానే ఉంది, థ్రిల్, సస్పెస్ చిత్రాలు చూసే వారికి నచ్చే సినిమా. 
రేటింగ్; 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments