Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులితో సెల్ఫీ దిగిన బాలీవుడ్ నటి ఎవరు..? వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సాహసే!

సాధారణంగా పులి కంటపడితే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పులితో సెల్ఫీ తీసుకోవడం అనేది ఓ సాహసంతో కూడుకున్నపనే. కానీ, ఈ బాలీవుడ్ నటి మాత్రం పులితో సెల్ఫీ తీసుకుంది.

Webdunia
సోమవారం, 18 జులై 2016 (16:51 IST)
సాధారణంగా పులి కంటపడితే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పులితో సెల్ఫీ తీసుకోవడం అనేది ఓ సాహసంతో కూడుకున్నపనే. కానీ, ఈ బాలీవుడ్ నటి మాత్రం పులితో సెల్ఫీ తీసుకుంది. ఆమెతో పాటు.. ఆమె కుమార్తెలు కూడా ఈ సాహసానికి దిగారు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరనే కదా మీ సందేహం. ఇంకెవరో కాదు.. సుస్మితా సేన్.
 
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి థాయ్‌లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ పులితో ఫోటోలు తిగింది. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె కూతుళ్లు కూడా పులితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఎక్కువ సమయం పిల్లలతో గడిపేందుకే కేటాయిస్తున్న సుస్మిత తమ హాలిడే ట్రిప్ పూర్తయిన తర్వాతే సినిమాలు, నెక్స్ట్  ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తానని చెబుతోంది. 
 
సుస్మిత చివరిసారిగా 2015లో బెంగాలీ చిత్రం 'నిర్బాక్‌'లో నటించింది. 40 ఏళ్లయినా పెళ్లి చేసుకోని సుస్మిత ఇప్పుడున్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీరినే తన సొంత బిడ్డలుగా భావించి.. అల్లారు ముద్దుగా పెంచుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments