మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతోనే...

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (12:45 IST)
ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈ పోస్టు మార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. 
 
మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం సుశాంత్ మరణం సినీ, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు. 
 
నేడు అంత్యక్రియలు 
భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. అతని అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరుగనున్నాయి. అంతేకాకుండా, సుశాంత్ మృతదేహాని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో నెగెటివ్ అని తేలింది. దీంతో సుశాంత్ కుటుంబ సభ్యులో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నా నుంచి ముంబైకు ఇప్పటికే చేరుకున్నారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సుశాంత్... ముంబై బాంద్రాలోని తన నివాసంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, తన కుమారుడు సుశాంత్ మరణ వార్త తెలుసుకున్న తండ్రి కృష్ణకుమార్ సింగ్ కుప్పకూలిపోయారు. ఈయన పాట్నాలో నివసిస్తున్నారు. ఆయనకు ఈ మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయారు. సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పాట్నా నివాసంలో సంరక్షకురాలిగా వ్యవహరిస్తున్న లక్ష్మీ దేవి వెల్లడించారు. 
 
సుశాంత్ అక్క చండీగఢ్ నుంచి పాట్నా బయల్దేరారని తెలిపారు. సుశాంత్ స్వస్థలం బీహార్ లోని పూర్ణియా జిల్లా మాల్దిహా ప్రాంతం. సినిమాలపై ఆసక్తితో ముంబయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ డిప్రెషన్‌కు‌లోనై బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కానీ, సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments