సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యేనా? తెరపైకి సరికొత్త చర్చ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (20:20 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారంటూ కూపర్ ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే రూపకుమార్ షా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. కాగా, రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఈ హత్య కేసుపై తొలుత ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతదేహానికి జరిపిన శవపరీక్షలో పాల్గొన్న కూపర్ ఆస్పత్రి సిబ్బంది తాజాగా చేసిన ఓ ప్రకటన ఇపుడు సంచలనం సృష్టిస్తుంది. "సుశాంత్ మృతదేహం వచ్చినపుడు అతని శరీరంపై గాయాలు ఉ్నాయి. అతడిని ఎవరో కొట్టారు" అని చెప్పారు. పైగా, మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన సమంయలోనూ తాను అక్కడే ఉన్నట్టు చెప్పారు. అది ఆత్మహత్య కాదు.. హత్య అని తాను వైద్యులకు చెప్పాను. కానీ వారు ఎవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు అని రూప కుమార్ వెల్లడించారు.
 
అయితే, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారని ప్రశ్నిచగా, విధుల్లో ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగరాదన్న కారణంతోనే ఈ విషయాన్ని తాను ఎక్కడా బహిర్గతం చేయలేదని చెప్పారు. కాగా, రూపకుమార్ ఇటీవలే ఆస్పత్రి విధుల నుంచి రిటైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

తండ్రిని వదిలించుకోవడానికి ప్లాన్.. సినిమా షూటింగ్ చూపిస్తామని తీసుకొచ్చి గొయ్యిలో పడేసిన కుమారులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments