Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యం నీ జ్ఞాపకాలతో ఎప్పటికీ నీ దాన్నే - సుశాంత్ మరణంపై రియా (video)

Webdunia
బుధవారం, 15 జులై 2020 (09:08 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఈ విషాదకర ఘటన ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది. ఈ క్రమంలో సుశాంత్‌తో ప్రేమ ఉందంటూ బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పేరు మార్మోగిపోయింది. పైగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి ఇప్పటివరకు స్పందించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇన్నాళ్ల మౌనం తర్వాత ఆమె తొలిసారిగా తన మనసులోని బాధను తీవ్రభావోద్వేగాల నడుమ వెల్లడి చేసింది.
 
'నాలో చెలరేగుతున్న భావోద్వేగాలకు సమాధానం చెప్పేందుకు ఇప్పటికీ తడబడుతూనే ఉన్నా. మరమ్మతులు చేయడానికి వీల్లేని విధంగా నా హృదయం మొద్దుబారిపోయింది. నాకు ప్రేమ పట్ల నమ్మకం కలిగించింది.. దాని శక్తి ఏమిటో తెలిపింది నువ్వే. ఓ చిన్న గణిత సమీకరణంతో జీవిత పరమార్థాన్ని ఎలా విడమర్చవచ్చో నేర్పింది నువ్వే. ఈ పాఠాలను నీ నుంచి రోజూ నేర్చుకుంటానని నీకు ప్రామిస్ చేశాను. నువ్విక్కడ లేనప్పుడు నేనెప్పటికీ నేర్చుకోలేను.
 
నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు అత్యంత ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నావు. నీకు ఆ చంద్రుడు, తారలు, పాలపుంతలు స్వాగతం పలికి ఉంటాయేమో! అత్యంత గొప్ప భౌతికవేత్తకు స్వాగతం అంటూ చేతులు చాచి పిలిచుంటాయేమో! పరవళ్లు తొక్కే ఆనందం, సహానుభూతితో ఓ గొప్ప తారగా వెలిగిపోవాల్సిన వాడివి. కానీ అందనంత దూరాలకు వెళ్లిపోయావు. నిన్ను నా వద్దకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాను.
 
ఈ ప్రపంచం నమ్మలేనంత సుందరుడివి నువ్వేనని అనుకునేదాన్ని. మన మధ్య చిగురించిన ప్రేమను వెల్లడించడానికి మాటలు చాలడంలేదు. నువ్వు చెబుతుండేవాడివి... అది మనిద్దరినీ మించినదని. దానర్థం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. ప్రతి విషయాన్ని విశాల హృదయంతో చూసేవాడివి. ఇప్పుడు మన ప్రేమ కూడా ఎంతో ప్రత్యేకమైనదని చూపావు. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సుషీ. ఈ 30 రోజుల ఎడబాటు బహుశా జీవితకాలపు ప్రేమ అవుతుందేమో. నిత్యం నీ జ్ఞాపకాలతో ఎప్పటికీ నీ దాన్నే!... కడవరకు, ఆ తర్వాత కూడా!" అంటూ ఎంతో భావుకతతో స్పందించింది. ప్రస్తుతం రియా చక్రవర్తి లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

సంబంధిత వార్తలు

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments