Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నుంచి బ్రేవ్ హార్ట్స్ పాట విడుదల

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (14:39 IST)
Surya Ayyala Somayajula
నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరిస్తే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి స్టోరీలపైనే మక్కువ పెరుగుతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు. 
 
దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ చిత్రంలోని బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి గీతాన్ని రిలీజ్ చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని రాము కుమార్ ఏ ఎస్ కే అందించగా.. ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని తట్టిలేపేలా ఉంది. 
 
దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. 
 
సాంకేతిక సిబ్బంది: కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ, నిర్మాత: దీపికాంజలి వడ్లమాని, సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్, సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి డిఎసి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments