Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఉద్యమం.. "S3-య‌ముడు-3" విడుద‌ల వాయిదా

తమిళ హీరో సూర్య, శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగుల

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (17:05 IST)
తమిళ హీరో సూర్య, శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి 26న తేదీ విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా విడుద‌ల వాయిదా వేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన "S3-య‌ముడు-3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితులని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రైన స‌మ‌యం కాద‌ని త‌ల‌చి ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జరిగింది. 
 
డైర‌క్ట‌ర్ హ‌రి, సూర్య కాంబినేష‌న్‌లో వ‌చ్చే చిత్రం కోసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలుసు.. కానీ ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఎప్పటికప్పుడూ వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మా త‌దుప‌రి విడుద‌ల తేదీని అతిత్వ‌ర‌లో ప్రకటిస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments