Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతుల కుటుంబాలకు హీరో సూర్య అండ...

Webdunia
సోమవారం, 24 జులై 2023 (14:58 IST)
తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతానికిగురై ప్రాణాలు కోల్పోయిన తన అభిమానుల కుటుంబాలకు అండగా ఉంటానని హీరో సూర్య హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు చెందిన సభ్యులకు ఆయన వీడియో కాల్ చేసి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. 
 
కాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో హీరో సూర్య పుట్టిన రోజైన ఆదివారం ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని కోటప్పకొండ యక్కాలవారిపాళెంకు చెందిన నక్కా వెంకటేశ్ (19), పోలూరి శేషులు (20)గా గుర్తించారు. వీరిద్దరూ ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికిగురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హీరో సూర్య మృతుల కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడారు. ఈ మేరకు మీడియో కాల్ చేసి వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. మృతుడి సోదరి తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా, తప్పకుండా ఆమె బాధ్యతలు తీసుకుంటానని సూర్య హామీ ఇచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments