Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 23న తెలుగు, తమిళ భాషల్లో సింగం-3 (ఎస్-3)

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకుడిగా భాసిల్లుతున్న సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు. తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌ రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శ

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (18:22 IST)
తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకుడిగా భాసిల్లుతున్న సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు.  తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌ రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలుత ఈ నెల 16న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేశాయి. అయితే తాజాగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 
 
పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు.  హరీస్ జైరాజ్ స్వరాలను సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ సూర్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో  రూపొందుతున్న చిత్రం ఇది.  రోజు రోజుకు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలవబోతుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. 
 
గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. డిసెంబర్ 23న తెలుగు, తమిళ భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments