Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ హీరోతో సురేష్ రైనా చాటింగ్... షాకైన హీరో

Webdunia
బుధవారం, 22 మే 2019 (13:13 IST)
ప్రస్తుతం దేశమంతటా ఎన్నికల ఫీవర్ కొనసాగుతున్న తరుణంలో సౌత్ స్టార్ సూర్య త్వరలో NGK (నంద గోపాల కృష్ణ) అనే పొలిటికల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సూర్య తన అభిమానులతో ట్విట్టర్‌లో చాట్ చేశారు. 
 
అయితే అనుకోకుండా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా లైన్లోకి రావడం, సూర్యను ప్రశ్నించడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రైనా సూర్యను 'చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మీకు ఏ ప్లేయర్ ఇష్టం? ఎందుకు?' అని ఆసక్తికరమైన ప్రశ్న వేసారు.
 
సురేష్ రైనా తన ట్విట్టర్ చాటింగ్‌కు రావడంలో ఆశ్చర్యంలో మునిగిపోయిన సూర్య తేరుకుని, నాతో మాట్లాడటానికి మీకు సమయం దొరికిందంటే నేను నమ్మలేకపోతున్నానని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ అంటే ఇష్టమని, ఈ టీమ్‌లో నేను మొదటగా కలిసిన ఆటగాడు ఆయన... ఆ తర్వాత మిమ్మల్ని(రైనా) కలిశాను. 
 
మీరే స్వయంగా వచ్చి నన్ను పలకరించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మీతో కలిసి దిగిన ఫోటో కూడా ఇంకా నా దగ్గర భద్రంగా ఉందని సమాధానమిచ్చారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న NGK సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments