Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడుపోయిన తర్వాత విచ్చలవిడి అయిందని కామెంట్స్ చేస్తున్నారు... సురేఖావాణి

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (14:01 IST)
మొగుడుపోయిన తర్వాత బాగా విచ్చలవిడి అయిపోయిందని చాలా మంది దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని సినీ నటి సురేఖావాణి అన్నారు. ఆమె తాజాగా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుమార్తె, వ్యక్తిగతంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, "నేను మా అమ్మాయితో కలిసి బయటికి వెళ్లినా... మా ఇద్దరికీ సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కొంతమంది చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. మొగుడుపోయిన తర్వాత విచ్చలవిడిగా తయారైందని కామెంట్స్ చేస్తున్నారు. 
 
భర్తలేని ఒక స్త్రీని పురుషుడు చూసే విధానం, అతని దృష్టికోణం మారుతుంది. ఈ సమాజంలో ఇలాంటి వాళ్లు ఉన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాధపడేదానిని కానీ, ఆ తర్వాత కామెంట్స్‌ను పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఎంతమంది నోళ్లను మూయిస్తాం. మా వాళ్ళకు కూడా ఆ కామెంట్స్ చూడొద్దనే మనవి చేశాను" అని అన్నారు. 
 
ఒకసారి వర్మగారితో కలిసి ఫోటో దిగితే దానిపై ఒకరు ఏకంగా యూట్యూబ్‌లో ఒక ఎపిసోడ్ చేశాడు. అలాంటివారిని చూసినపుడు ఇంతమంది ఖాళీగా ఉంటున్నారా? అని మనసులో అనుకుంటాను. నా వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అనే అనుకుంటాను" అని చెప్పాను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments