Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేఖ భ‌యంతో రాత్రి నిద్ర‌పోలేదుః ఏ ఒక్క‌రూ గొప్ప‌కాదుః చిరంజీవి

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (23:38 IST)
godfater success meet
గాడ్ ఫాద‌ర్ విడుద‌ల‌కుముందు నాకంటే నా భార్య సురేఖ చాలా టెన్ష‌న్ ప‌డింది. భ‌య‌ప‌డింది. నేను ఎంత కాన్‌ఫిడెన్స్‌గా వున్నా ఆమె డ‌ల్ చూసి నేను కాస్త కంగారు ప‌డ్డాను. ఎందుకంటే ఒక్కోసారి బాగున్న‌వి అనుకున్న‌వి ఢ‌మాల్ అయిన సంద‌ర్భాలున్నాయి. గాడ్ ఫాద‌ర్ విడుద‌ల చివ‌రి క్ష‌ణంలో నిద్ర స‌రిగ్గా పోలేదు. విడుద‌ల రోజు ముందుగా నిర్మాత ఎన్‌వి ప్ర‌సాద్ ఫోన్ చేసి లండ‌న్ నుంచి కాల్ వ‌చ్చింద‌ని చెప్పారు. ఆ త‌ర్వాత అమెరికా నుంచి కుమార్ అనే ఫ్రెండ్ ఫోన్ చేసి మా స్ట‌యిల్‌, న‌డ‌క గురించి చెబుతున్నాడే కానీ సినిమా ఎలా వుంద‌ని చెప్ప‌లేదు. దాంతో కొన్ని క్ష‌ణాలు ఎక్క‌డ‌ లేని వ‌ణుకు వ‌చ్చింది.
 
ఫైన‌ల్‌గా ఉద‌యం 6 గంట‌ల‌కు అమెరికాలోని కొంద‌రు నిర్మాత అనిల్ సుంక‌ర వంటివారు ఫోన్ చేసి సూప‌ర్ సినిమా సార్‌. బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే చాలా ఆనంద‌మేసింది. ఏది ఏమైనా ఈ సినిమా విజ‌యం ఒక్క బ్రెయిన్ వ‌ల్ల‌కాదు. ఇద్ద‌రు ముగ్గురు బ్రెయిన్స్ వ‌ల్ల సాధ్యం. ఏ ఒక్క‌రూ గొప్ప‌కాదు. అంద‌రి కృషి వ‌ల్లే గొప్ప‌వారు అవుతార‌ని అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

 
మీడియా విమ‌ర్శ‌లు- ప్ర‌శంస‌లు
మేం సినిమా విడుద‌ల‌కు టెన్ష‌న్‌లో వుంటే, మీడియా ఏవేవో రాసేసింది. దాంతో మాకు లేనిపోని డౌట్లు వ‌చ్చాయి. అందుకే ప్రీ-రిలీజ్‌రోజు జోరున వ‌ర్షంలో ర‌సాభాస అవుతుంద‌ని భ‌య‌ప‌డి నేనే మైక్ తీసుకుని అప్ప‌టి క‌ప్పుడు ఓన్‌గా మాట్లాడాను. అది అంద‌రికీ న‌చ్చి మీడియా కూడా న‌న్ను మోసింది. ఇందుకు వారికి హృద‌య‌పూర్వ‌క ధన్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments