Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు : నటి రియా చక్రవర్తికి ఊరట

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:47 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆయన ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రియాతో పాటు ఆమె కుటుంబంపై ఉన్న లుకౌవుట్ సర్క్యూలర్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
 
కాగా, సుశాంత్ 2020 జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెల్సిందే. అయితే, సుశాంత్ ఆత్మహత్ చేసుకోలేదని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తూ, ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావించి ఈడీ రియాను ప్రశ్నించింది. 
 
ఆ తర్వాత, కేసును సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

‘గంగవ్వ చిలుక పంచాంగం’: గంగవ్వపై కేసు ఏమిటి, చిలుకను పెంచుకోవడం నేరమా?

వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?

జబాలియా శిబిరంపై వైమానిక దాడులు - 200మంది పాలస్థానీయులు మృతి

యువరాజ్ సింగ్: బ్రెస్ట్ క్యాన్సర్‌పై నారింజ పండ్ల యాడ్, వివాదం ఏంటి?

సాక్షి మీడియా జగన్ చేతిలో ఉంది.. ఏదైనా నమ్మించగలడు.. వైస్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

చింతకాయలు వచ్చేసాయి, ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments