Webdunia - Bharat's app for daily news and videos

Install App

Superstar Rajinikanth Birth Day Special: జైలర్ ట్రీట్ రెడీ

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (10:31 IST)
నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.. సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అభిమానులు తలైవర్, సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు.  ఈ రోజును రజనీకాంత్ పుట్టిన రోజు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్ మోడ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో రజనీకాంత్ సినిమాలు చుట్టూ హ్యాష్ ట్యాగ్‌లు టాప్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.  
 
రజనీకాంత్ తన కెరీర్‌ను సహాయ నటుడిగా ప్రారంభించినప్పటికీ, అతని స్టైల్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ స్టైల్ అతన్ని హీరోగా మార్చడానికి కారణమైంది. స్టైలిష్ నటుడు తరువాత ప్రముఖ హీరోలలో తనను తాను నిలబెట్టుకోవడానికి అనేక వినోదాత్మక చిత్రాలను అందించాడు. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.  
 
ఒక తమిళ నటుడిగా, రజనీకాంత్ చిత్రాలు ఎల్లప్పుడూ ప్రపంచ ప్రజలను భారీ స్థాయిలో ఆకట్టుకుంటూ వున్నాయి. డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్లను తెగ ట్రోల్ చేస్తున్నారు. 
 
అభిమానులతో పాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా, రజనీకాంత్ రాబోయే చిత్రం జైలర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రం నుండి ముత్తువేల్ పాండియన్ గ్లింప్స్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన పుట్టినరోజు సందర్భంగా వస్తుందని ప్రకటించింది. పేరుకు తగ్గట్టుగానే తలైవర్ ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్‌లో జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నాడు.
 
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం జైలర్. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, వసంత్ రవి, యోగి బాబు, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ, ఆర్ నిర్మల్ ఎడిటింగ్ అందిస్తున్నారు. జైలర్ 2023 వేసవిలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

సజ్జల భార్గవ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి: వైఎస్ షర్మిల

కొత్త మెనూని పరిచయం చేసిన హైదరాబాద్ బౌగెన్‌విల్లా రెస్టారెంట్

మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు వుండాలి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments