Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. మహేష్ ఆ తప్పు చేశాడు.. ఏంటది..?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (18:28 IST)
Prabhas_mahesh
డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని రాధేశ్యామ్ సినిమా నుంచి పోస్టర్లు, బీజీఎంలు విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే డార్లింగ్‌కు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఇదే తరహాలో ప్రభాస్ సహచర హీరోలు కూడా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో ప్రభాస్ పుట్టినరోజుకు కూడా మహేష్ బాబు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
 
''పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రభాస్ మీకు అనంతమైన విజయం, ఆనందం అలాగే శాంతి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. అని మహేష్ చాలా ఫ్రెండ్లిగా పేర్కొన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్ సినిమా ఈవెంట్‌కి సంబంధించిన ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. అప్పుడు ప్రభాస్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ మొదట ట్వీట్ చేసినప్పుడు మహేష్ బాబు ఒక పొరపాటు చేశాడు.
 
ప్రభాస్ ఐడి అనుకోని ఎవరిదో ఫేక్ ఎకౌంట్ అడ్రస్‌తో ట్యాగ్ చేశాడు. అయితే ప్రభాస్‌కి ట్విట్టర్ ఎకౌంట్ లేకపోవడంతో ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఆ ఎకౌంట్ ఓపెన్ చేయడంతో రాకేష్ అనే మరో పేరు చూపించింది. ఇక కొద్దీ సేపటికి తన పొరపాటు తెలుసుకున్న మహేష్ వెంటనే ట్యాగ్ తీసేశాడు. 
 
మహేష్ బాబు స్టార్ హిరోలందరితో కూడా స్నేహంగా ఉండాలని కోరుకుంటాడని మరోసారి రుజువైంది. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వంటి స్టార్స్‌తో కూడా క్లోజ్‌గా ఉండే మహేష్ వారి పుట్టినరోజు సందర్భంగా కూడా చాలా సార్లు తన బర్త్ డే విషెస్ అందించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్‌కి బర్త్ డే విషెస్ అంధించడంతో అభిమానులు ఆ ట్వీట్‌ని వైరల్ అయ్యేలా రీట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments