Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతి నిండా ఉంగరాలతో సునీల్... సెంటిమెంట్ పండుతుందా?

అతని పేరు రాంబాబు. నమ్మకాలు ఎక్కువ. నెమ్మదస్తుడు, నమ్మకస్తుడు కూడా. పదిమందికి సాయపడాలనే తత్త్వం అతనిది. చేతినిండా ఉంగరాలు పెట్టుకుని అనుకున్నది సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి ఓ సమయంలో అతనికి ఎదురైన పరిస్థితుల్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపిస్తూ..

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (17:12 IST)
అతని పేరు రాంబాబు. నమ్మకాలు ఎక్కువ. నెమ్మదస్తుడు, నమ్మకస్తుడు కూడా. పదిమందికి సాయపడాలనే తత్త్వం అతనిది. చేతినిండా ఉంగరాలు పెట్టుకుని అనుకున్నది సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి ఓ సమయంలో అతనికి ఎదురైన పరిస్థితుల్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపిస్తూ.. 'ఉంగరాల రాంబాబు' చిత్రం రూపొందిస్తున్నట్లు దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెలియజేస్తున్నాడు. 
 
పరుచూరి ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని హీరో ఎంట్రీ సాంగ్‌ అన్నపూర్ణ ఏడెకరాలలో చిత్రిస్తున్నారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.... టైటిల్‌ వింటుంటే ఎంత ఫన్నీగా ఉందో సినిమా ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు అంతే ఫన్‌ ఉంటుంది. ఒకప్పుడు సీనియర్‌ నటుడు చలంగారి సంబరాల రాంబాబు అనే టైటిల్‌లా ఎంతో బావుందని నా స్నేహితులు కొంతమంది ఫోన్‌ చేశారు. క్రాంతి మాధవ్‌ వంటి మంచి స్ట్రెంగ్త్‌ ఉన్న దర్శకుడితో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. అప్పట్లో రాజేంద్రప్రసాద్‌గారు చేసిన క్యారెక్టర్స్‌ తరహాలో ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఉంటుంది. అందాల రాముడు, పూల రంగడు సినిమాల తరహాలో ఎంజాయింగ్‌గా ఉంటుంది. 
 
రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ను కూడా దర్శకుడు క్రాంతి మాధవ్‌ ఓ ఇన్నోవేషన్‌తో కాన్సెప్ట్‌ ప్రకారం ఫస్ట్‌లుక్‌ను తయారు చేశారు. ఓ ఐదారు రోజుల మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ రోజు చిత్రీకరణ జరుపుకుంటున్న సాంగ్‌తో సినిమా పాటలన్నీ పూర్తవుతాయి. సినిమాలో ఐదు సాంగ్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ విషయానికి వస్తే హీరో చిన్నపిల్లాడి వంటి మనస్తత్వం ఉండే మంచి వ్యక్తి. జాతకాలను నమ్మే క్యారెక్టర్‌. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ వంటి సీనియర్‌ నటుడుతో కూడా నటించడం మంచి అనుభవాన్నిచ్చింది. మంచి కామెడితో పాటు సోషల్‌ ఆవేర్‌నెస్‌ ఉన్న చిత్రం. సినిమాలో పాత్ర కోసం ఇంతకుముందు సునీల్‌లా లావుగా కనపడాలని డైరెక్టర్‌గారు అడగడంతో పాత్ర కోసం అలా మెయింటైన్ చేశానన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments