Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జైలర్"లో సునీల్ లుక్ అదిరిపోయింది..

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (12:07 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "జైలర్". యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణతో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లార్, హాస్య నటుడు యోగిబాబు వంటి వారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ కొత్త అంశాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో తెలుగు హాస్య నటుడు సునీల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు తెలిపింది. సునీల్‌కు సంబంధించిన లుక్‌ను మంగళవారం సాయంత్రం నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఆయన పాత్ర, బాడీ లాంగ్వేజ్‍ కూడా డిఫరెంట్‌గా ఉండనున్నాయనే సంగతి ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. 
 
ఈ చిత్రంలో రజనీకాంత్ జైలర్‌గా నటిస్తున్నారు. కథ అంతా జైలుతో ముడిపడి, జైలర్ చుట్టూత తిరుగుతుంటుంది. అనిరుధ్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన తమిళ ఉగాదికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
కాగా, సునీల్ గతంలో పుష్ప చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఇందులో నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇపుడు మరోమారు జైలర్ చిత్రంలో ఒక విలన్ పాత్రధారిగా నటిస్తున్నట్టు ఈ లుక్‌ను చూస్తే తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments