Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమంత్‌తో నాగార్జున చిత్రం 'నరుడా డోనరుడా' షాకింగ్ లుక్... సుమంత్ వీర్య కణాలపై స్వారీ...

అక్కినేని నాగేశ్వర రావు స్వర్గుస్తులయ్యాక సుమంత్‌ను దూరంగా పెట్టారని వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేశాయి. అందుకు కారణంగా.. ఆయన ఎప్పుడూ ఏ ఫంక్షన్‌లో కన్పించకపోవడమే. ఆ తర్వాత ఇటీవలే ఓ కార్యక్రమంలో కలిశాడు. తాజాగా వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లుగా..

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (18:31 IST)
అక్కినేని నాగేశ్వర రావు స్వర్గుస్తులయ్యాక సుమంత్‌ను దూరంగా పెట్టారని వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేశాయి. అందుకు కారణంగా.. ఆయన ఎప్పుడూ ఏ ఫంక్షన్‌లో కన్పించకపోవడమే. ఆ తర్వాత ఇటీవలే ఓ కార్యక్రమంలో కలిశాడు. తాజాగా వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లుగా... నాగార్జున.. సుమంత్‌ సినిమాను ప్రమోషన్‌ చేయనున్నారు.
 
సుమంత్‌ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం 'నరుడా..! డోనరుడా'. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను నాగార్జున విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ లోని విలక్షణత వల్ల ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్‌ నుండి చాలా చాలా రెస్పాన్స్‌ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో రమా రీల్స్‌, ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఈ సినిమాతో పల్లవి సుభాష్‌ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. తనికెళ్ళ భరణి ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కిట్టు విస్సాప్రగడ, సాగర్‌ రాచకొండ మాటలు అందిస్తున్నారు. వై. సుప్రియ, జాన్‌ సుధీర్‌ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ఐతే సుమంత్ లుక్ చూసి షాకింగ్ గురవుతున్నారు కొందరు. వెనుక ఏనుగు తొండాలు.... ముందు సుమంత్ వీర్య కణాలపై స్వారీ గట్రా అంతా చూస్తుంటే ఇది మగవాడి ఫెర్టిలిటీ ఇతివృత్తంగా తీస్తున్నట్లు అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగాలు ఎక్కువైపోవడమూ, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడమనే సమస్యలు వస్తున్నాయి కూడా. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా సాగుతుందని అనుకోవచ్చు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments