ఈనెల 28న మెగా డాటర్ నీహారిక 'హ్యాపి వెడ్డింగ్'.. వరుడు అతనే...

మెగా డాటర్ నీహారిక "వెడ్డింగ్" ఈనెల 28వ తేదీన జరుగనుంది. 'వెడ్డింగ్' అంటే.. ఆమె పెళ్లి కాదండోయ్. ఆమె నటించిన తాజా చిత్రం "హ్యాపి వెడ్డింగ్". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఇందులో సుమంత్ అశ్వి

Webdunia
బుధవారం, 11 జులై 2018 (13:05 IST)
మెగా డాటర్ నీహారిక "వెడ్డింగ్" ఈనెల 28వ తేదీన జరుగనుంది. 'వెడ్డింగ్' అంటే.. ఆమె పెళ్లి కాదండోయ్. ఆమె నటించిన తాజా చిత్రం "హ్యాపి వెడ్డింగ్". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఇందులో సుమంత్ అశ్విన్ హీరో. డెబ్యూ డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ క‌ర్య తెర‌కెక్కించారు.
 
వెండితెర అరంగేట్రం చేసిన నిహారిక న‌టించిన తొలి చిత్రం "ఒక మ‌న‌సు". ఈ చిత్రానికి మిశ్రమ టాక్ వచ్చింది. ఇపుడు ఆమె రెండో సినిమాపై అభిమానుల‌లో చాలా అంచ‌నాలు ఉన్నాయి. హ్య‌పి వెడ్డింగ్ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌ల కాగా, ఇందులో "పాల లాంటిది మా హ‌ర్ష‌.. కాఫీ చేసుకోవ‌చ్చు, కాంప్లైన్ చేసుకోవ‌చ్చు.. మ‌రి మా మ‌న‌వ‌డితో కాపురం చేసుకోవ‌చ్చా అండి" అనే డైలాగ్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 
 
ఇక తాజాగా విడుద‌లైన ప్రోమో సాంగ్ కూడా అల‌రించింది. ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం బాణీలు సమకూర్చారు. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments