Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు‌.. ఆ షోను ఆపేయమన్న సుమ.. ఏమైంది?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (13:11 IST)
బుల్లితెరలో టాప్ యాంకర్ ఎవరంటే ఎవరైనా సరే మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు సుమ. గత రెండు దశాబ్దాలుగా ఆమె ప్రోగ్రామ్‌లు, ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ యువ యాంకర్లకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు. ఆమె హోస్ట్‌గా చేసే అనేక షోలు సీజన్ల తరబడి కొనసాగుతున్నాయి.


అయితే అలా సీజన్లుగా ఆగిపోకుండా ఏకధాటిగా ఒక షో మాత్రం మధ్యాహ్నం ప్రైమ్ టైమ్‌లో ఒక సంవత్సరం కాదు, రెండేళ్లు కాదు, ఏకంగా 11 ఏళ్ల నుండి కొనసాగుతోంది. అదే స్టార్ మహిళ.
 
సాధారణంగా ఆ సమయంలో ఎక్కువమంది చూస్తారు కాబట్టి, ఎంతో జనాదరణ ఉన్న షోలను మాత్రమే టీవీ ఛానెళ్లు ప్రసారం చేస్తూ, తమ టిఆర్‌పీలను పెంచుకుంటాయి. అలాంటి ప్రముఖ ఛానెల్ ఆ సమయాన్ని 11 ఏళ్ల పాటు ఒకే షోకు కేటాయించమంటే ఆ కార్యక్రమాన్ని సుమ ఎంత జనరంజకంగా నడుపుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం తెచ్చి పెట్టింది.
 
2008 ఆగస్టు 9న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏకధాటిగా 11 ఏళ్లు సాగుతూ 3000 ఎపిసోడ్‌లకు పూర్తి చేసుకుని దేశంలోనే సుదీర్ఘకాలం కొనసాగిన షోగా ఘనత పొందింది. అయితే ఈ షో గత వారంతో ముగిసింది. చివరి వారాన్ని ఫేర్‌వెల్ వీక్‌గా సెలిబ్రేట్ చేసి, చివరిగా శనివారం నాడు 3181 ఎపిసోడ్‌తో ముగించారు. చివరి ఎపిసోడ్‌కి షోకు సంబంధించిన ప్రముఖులను ఆహ్వానించారు. 
 
వారు మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని, దీన్ని నిలిపివేయడం చాలా బాధాకరం అని చెప్పారు. ఇప్పుడు కూడా సుమ కొంత విరామం కావాలని ఆపివేయాల్సింగా కోరడం వల్లనే ఈ షోకు ముగింపు పలికినట్లు వారు చెప్పడం గమనార్హం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments