Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ బయోపిక్‌లో సబితమ్మగా సుహాసిని..?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి బయోపిక్.. యాత్ర పేరిట రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మహి వి. రాఘవ రూపొందిస్తున్నాడు. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిన

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (15:59 IST)
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి బయోపిక్.. యాత్ర పేరిట రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మహి వి. రాఘవ రూపొందిస్తున్నాడు. వైఎస్సార్  పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఇప్పటికే ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.


వై.ఎస్. రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేయడంతో ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం ''ఆశ్రిత వేముగంటి''ని ఎంపిక చేసుకున్నారు.
 
''బాహుబలి 2'' సినిమాలో 'కన్నా నిదురించరా..' అనే పాటలో అనుష్కతో పాటు ఆశ్రిత వేముగంటి మెరిసింది. దీంతో మమ్ముట్టి సరసన అవకాశాన్ని ఆశ్రిత కొల్లగొట్టింది. ఇక సబితా ఇంద్రారెడ్డి పాత్ర కోసం సినీనటి సుహాసినిని ఎంపిక చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు సుహాసిని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకున్నారు.
 
ఆనందో బ్రహ్మ సినిమా ఫేమ్ దర్శకుడు మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించే ఈ సినిమా 70 ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మితమవుతోంది. విజయ్ చిలలా, శశి దేవ్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇందులో వైకాపా వైఎస్.జగన్‌ సోదరిగా భూమిక నటించనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments