Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు సినిమా మా నాన్న దసరాకి రిలీజ్

డీవీ
మంగళవారం, 27 ఆగస్టు 2024 (14:58 IST)
Sudhir Babu
నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా 'మా నాన్న సూపర్‌హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
 
మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుంది. సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటి. ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న 'మా నాన్న సూపర్ హీరో' రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే రివిల్ చేయనున్నారు. 
 
'మా నాన్న సూపర్‌హీరో' మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
 
 సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్.
 
MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోడీ నా‌పై‌ చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలువైనది...

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments