Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (16:44 IST)
Sudhir Babu, kritisetty poster
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లొకి రావడంతో  ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.
 
ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను త్వరలోనే చిత్రయూనిట్ విడుదల చేయనుంది.
 
వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. పీజీ విందా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్ట‌ర్, మార్తాండ్ కే వెంకటేష్‌ ఎడిట‌ర్‌.
 
అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments