Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ జయంతి నాడు సుధీర్ బాబు నటించిన హరోం హర సిద్ధం

డీవీ
శనివారం, 27 ఏప్రియల్ 2024 (17:15 IST)
Sudhir Babu
సుధీర్‌బాబుకు తన మామగారు సూపర్‌స్టార్ కృష్ణ అంటే చాలా గౌరవం. కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాల కంటెంట్ ఏదైనా విడుదల చేస్తుంటారు. ఈసారి తన అప్ కమింగ్ మూవీ 'హరోం హర' చిత్రాన్ని ఇండియన్ ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్లు యూనిట్ అనౌన్స్ చేసింది. ఇది పర్ఫెక్ట్ డేట్. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ రెండవ వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది.
 
రిలీజ్ డేట్ పోస్టర్  పోస్టర్‌లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది, అతని వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు. సూపర్ బాబు ఫెరోషియస్ గా కనిపిస్తున్న పోస్టర్ అదిరిపోయింది.
 
ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
 
హరోం హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  
 
చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొదటి పాట ఇంటెన్స్‌గా ఉండగా, ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ సోల్‌ఫుల్ మెలోడీగా ఉంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
 
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మళ్లీ సీన్‌లోకి "డయల్ యువర్ సీఎం"

ఉద్యోగులకను డేటింగ్‌కు ప్రోత్సహిస్తున్న చైనా కంపెనీ... పార్ట్‌నర్‌ను వెతికిపెట్టినా సరే...

ఏపీ ఎన్నికల్లో నిజమైంది.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేకే ఏమంటోంది?

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? గరికపాటి పాత వీడియో వైరల్

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments