Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు, మా నాన్న సూపర్ హీరో లేటెస్ట్ అప్డేట్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (16:40 IST)
Sudheer Babu on location
సుధీర్ బాబు హీరోగా లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ కంటెంట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌ తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో షూటింగ్ పూర్తి అయిన సందర్భం గా చిత్ర యూనిట్ తో ఉన్న సెల్ఫీస్ ,వీడియో హీరో సుధీర్ బాబు తన సామజిక మాధ్యమం లో షేర్ చేశారు.
 
మా నాన్న సూపర్ హీరో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. 
 
ఫాదర్స్ డే సందర్భంగా మనసుని హత్తుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం తండ్రి కొడుకు మధ్య అనుబంధానికి నిజమైన అర్ధం చెబుతూ మనసుల్ని కదిలించే ఓ అద్భుతమైన ప్రయాణంగా ఉండబోతున్నట్టు  టైటిల్ పోస్టర్ సూచిస్తూ  సినిమాపై ఆసక్తిని పెంచింది.
 
ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ ముఖ్య తారాగణం.  సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్ కాగా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్.
 
దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో పాటు ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల ఈ చిత్రానికి రైటర్స్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌ గా కూడా పని చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments