సినీ తారలు సుదీప్‌ను చూసి నేర్చుకోవాల్సిందేనట.. విడాకులు వద్దని భార్యతో కలిసి?
బాలీవుడ్‌లో విడాకుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో.. దక్షిణాది కన్నడ స్టార్ హీరో, ఈగ ఫేమ్ సుదీప్ తన మనసు మార్చుకున్నాడు. కుటుంబ కలహాలను పరిష్కరించుకుని, భార్యతో కలసి జీవించాలని డిసైడైపోయాడు. కుటుంబ కలహా
బాలీవుడ్‌లో విడాకుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో.. దక్షిణాది కన్నడ స్టార్ హీరో, ఈగ ఫేమ్ సుదీప్ తన మనసు మార్చుకున్నాడు. కుటుంబ కలహాలను పరిష్కరించుకుని, భార్యతో కలసి జీవించాలని డిసైడైపోయాడు. కుటుంబ కలహాలతో సుదీప్ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ తాజా నిర్ణయంతో భార్యతో పాటు, కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకొంది.
ఇకపోతే.. సుదీప్, ప్రియ 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని వీరిద్దరూ ఇటీవల నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. నెట్టింట్లో సుదీప్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.