తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఫైట్ సన్నివేశం ఒకటి లీక్ అయింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఫైట్ సన్నివేశం ఒకటి లీక్ అయింది. ఈ పోరాట సన్నివేశం ఎడిటింగ్ టైంలోనే ఇది బయటకు వచ్చి ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. దీంతో మరోసారి ఈ లీకేజ్ జరగకుండా చిత్ర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.
ముంబైలోని తమిళనాడుకు చెందిన ఓ దాదా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వండర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై రజనీ అల్లుడు ధనుష్ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుందని చిత్ర బృందం రీసెంట్‌గా ప్రకటించింది. ఈ చిత్రానికి సబంధించిన ఓ వీడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, పా. రంజిత్ దర్శకత్వంలో గతంలో వచ్చిన కబాలి చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన విషయం తెల్సిందే. అదేసమయంలో ఆరు పదుల వయసులో కూడా రజనీకాంత్ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వెండితెరపై ఇరగదీస్తున్నాడు.