Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

డీవీ
శనివారం, 16 నవంబరు 2024 (09:27 IST)
Clap by Damodar prasad
ప్రస్తుతం కొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్నాయి. కొత్త తరం ఇండస్ట్రీలోకి వస్తూ డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మహా సంద్రం’ అనే యాక్షన్ డ్రామాతో కొత్త టీం రాబోతోంది. నవీనీత్ రైనా హీరోగా రాబోతోన్న ఈ చిత్రానికి శేషు రావెళ్ళ, కార్తికేయ. వి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వీవీఎం క్రియేషన్స్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని కార్తికేయ. వి నిర్వర్తించనున్నారు.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహంచారు. ఈ ఈవెంట్‌కు దామోదర ప్రసాద్, ఎన్. శంకర్, సముద్ర, ఆర్. అనిల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పూజా కార్యక్రమాల అనంతం దామోదర ప్రసాద్ క్లాప్ కొట్టగా.. ఎన్. శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. పద్మనాభరెడ్డి, రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందజేశారు.
 
ఈ చిత్రానికి ప్రేమ్ రాజ్ ఎనుముల డైలాగ్స్ అందించనున్నారు కళ్యాణ్ సామి కెమెరామెన్‌గా, జగదీష్ ఎడిటర్‌గా పని చేయనున్నారు. 
 తెలుగు, హిందీలో ద్విభాష చిత్రంగా రాబోతోన్న ‘మహా సంద్రం’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
 నటీనటులు : నవనీత్ రైనా, టైగర్ శేషు, పెద్ది రాజ్, మళ్లీఖార్జున, ప్రతాప్ చల్లా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments