బాహుబలికి తర్వాత జక్కన్న మహాభారతం?: అమీర్, షారూఖ్, సల్మాన్‌లతో పాటు ఆ ఇద్దరు?
బాహుబలి-2 సినిమా రిలీజ్ చేసే దిశగా జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో పూర్తిగా దృష్టి పెట్టాడు. బాహుబలి-2 ప్రమోషన్‌తో పాటు.. తదుపరి ప్రాజెక్టుపై కూడా జక్కన్న చర్చలు మొదలెట్
బాహుబలి-2 సినిమా రిలీజ్ చేసే దిశగా జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో పూర్తిగా దృష్టి పెట్టాడు. బాహుబలి-2 ప్రమోషన్‌తో పాటు.. తదుపరి ప్రాజెక్టుపై కూడా జక్కన్న చర్చలు మొదలెట్టాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జాతీయ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం రాజమౌళి షారూఖ్ ఖాన్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
బాహుబలి-2కి తర్వాత సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్‌లతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ రాజమౌళి మాత్రం షారూఖ్ ఖాన్ పేరునే ఫిక్స్ చేశాడని బిటౌన్ అంటోంది. కానీ రజనీకాంత్, అమీర్ ఖాన్, మోహన్ లాల్ వంటి వారితో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వస్తున్నాయి. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు.
బాహుబలి-2కి తర్వాత తప్పకుండా జక్కన మహాభారతంపై దృష్టి పెడుతాడని.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, మోహన్‌లాల్‌తో పాటు షారూఖ్ కూడా ఆ చిత్రంలో ఉంటాడని ఓ వర్గం చెప్తోంది. మరి భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో జక్కన్న బిగ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.