Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2: తమిళ రైట్స్ వామ్మో రూ.54కోట్లా.. షాకవుతున్న డిస్ట్రిబ్యూటర్లు!!

బాహుబలి 2కి భారీ రేట్స్ పలుకుతున్నాడు. నిర్మాతలు చెప్తున్న రేటుకు డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోతున్నారు. బాహుబలి తమిళ వెర్షన్ టోటల్ రైట్స్‌ని చిత్ర నిర్మాతలు రూ.54 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దానిక

Webdunia
ఆదివారం, 17 జులై 2016 (14:45 IST)
బాహుబలి 2కి భారీ రేట్స్ పలుకుతున్నాడు. నిర్మాతలు చెప్తున్న రేటుకు డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోతున్నారు. బాహుబలి తమిళ వెర్షన్ టోటల్ రైట్స్‌ని చిత్ర నిర్మాతలు రూ.54 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దానికి పైసా కూడా తగ్గేది లేదని అంటున్నారట. దీంతో పంపిణీదారులు తలపట్టుకుంటున్నారట.

బాహుబలి ది బిగినింగ్ ప్రపంచ స్థాయిలో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఏకంగా రూ.600 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఇదే క్రేజ్ బాహుబలి 2కి కూడా కొనసాగుతోంది. బాహుబలి 2 సినిమాను విడుదల చేయాలనుకునే వారు మాత్రం షాక్ అవుతున్నారు. 
 
బాహుబలి తొలి భాగాన్ని సూర్యకు చెందిన స్టూడియో గ్రీన్‌తో కలసి ప్రభాస్ హోం బ్యానర్ వంటిదైన యువి క్రియేషన్స్ తమిళంలో విడుదల చేసింది. మొదటి పార్ట్‌ని అక్కడ 28 కోట్లకు అమ్మితే, రూ.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. దాంతో నిర్మాతలు రెండో పార్ట్‌ని ఏకంగా రూ.54 కోట్లు చెప్తున్నట్లు సమాచారం.

ఈ రేటు చూసి ప్ర‌భాస్‌తో పాటు, స్టూడియో గ్రీన్ వాళ్లూ జంకుతున్నారట. మరి బాహుబలి 2పై భారీ అంచనాలున్న నేపథ్యంలో రూ.54 కోట్లు డిమాండ్ చేయడం పెద్దవిషయం కాదని నిర్మాతలు చెప్తున్నారు. మరి బాహుబలి తమిళ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments