Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్ కాదు సంఘమిత్ర... చారిత్రాత్మక చిత్రానికి సై

టాలివుడ్, బాలివుడ్ ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే చరిత్ర ప్రాధాన్యమున్న సినిమాలకు ఇప్పుడున్న డిమాండ్ అంత ఇంతా కాదు. చోటా మోటా నటులే కాదు బడా బడా స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పుడు చారిత్రాత్మక చిత్రమంటే చాలు సై అంటున్నారు. క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (05:06 IST)
టాలివుడ్, బాలివుడ్ ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే చరిత్ర ప్రాధాన్యమున్న సినిమాలకు ఇప్పుడున్న డిమాండ్ అంత ఇంతా కాదు. చోటా మోటా నటులే కాదు బడా బడా స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పుడు చారిత్రాత్మక చిత్రమంటే చాలు సై అంటున్నారు. క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్ కూడా ఇప్పుడు చరిత్రను కౌగలించుకుంటున్నారని వినికిడి. 
 
బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రంలో క్రేజీ హీరోయిన్  శ్రుతీహసన్  ఒక భాగం కానున్నారని కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. శ్రుతి ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆ బ్యూటీ సూర్యకు జంటగా నటించిన సీ–3 మంచి విజయం సాధించింది. తాజాగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శబాష్‌నాయుడు చిత్రంలో తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఇది తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అన్నది గమనార్హం. హిందీలో బెహెన్ మోగి తెరి అనే చిత్రంతో పాటు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు.
 
తాజాగా సంఘమిత్ర అనే హిస్టారికల్‌ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్నారు. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్‌షీట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్‌ జయంరవి, ఆర్యలను కథానాయకులుగా ఎంపిక చేశారు.
 
అదేవిధంగా వారికి జంటగా బాలీవుడ్‌ భామలు దీపికాపడుకునే, సోనాక్షిసిన్హాలను నటింపజేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఒక కథానాయకిగా టాప్‌ హీరోయిన్లలో ఒకరైన శ్రుతీహాసన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆ ఏడాది రెండవ భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న సంఘమిత్ర చిత్రానికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments