Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి ముఖ్య అతిథిగా విజయేంద్రప్రసాద్ 'శ్రీవల్లి' ఆడియో వేడుక

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (09:17 IST)
'బాహుబలి', 'భజ్‌రంగీ భాయిజాన్' చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'శ్రీవల్లి'. రజత్, నేహాహింగే జంటగా  నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్నారు. ఈ నెల 23న  చిత్ర గీతాలను విడుదలచేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 
ఇదే అంశంపై దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ... సైన్స్ ఫిక్షన్ కథాంశానికి ప్రేమ, యాక్షన్ హంగులను మేళవించి రూపొందిస్తున్న చిత్రమిది. మనిషి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఏం జరుగుతుందనే పాయింట్‌తో ఆద్యంతం ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. ఎరోటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. 
 
అనంతరం నిర్మాత మాట్లాడుతూ... ఈ నెల 23న చిత్ర గీతాలను విడుదల చేయనున్నాం. ఈ వేడుకకు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఆయనతో పాటు ప్రముఖ హీరో, కాజల్ అగర్వాల్‌తో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సునీత.
అన్నీ చూడండి

తాజా వార్తలు

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

కుంభమేళా అంటే ఏమిటి? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఎందుకు జరుగుతుంది

మున్సిపల్ యాక్ట్ రద్దు.. అమరావతిలో ఇంజనీరింగ్ కాలేజీలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments