Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నితిన్‌కు హీరోయిన్ రాశిఖన్నాకు పెళ్లి...

హీరో నితిన్‌కు హీరోయిన్‌ రాశిఖన్నాకు పెళ్లి జరిగింది. పెళ్లి అంటే నిజమైన పెళ్లి కాదండోయ్... సినిమాలో పెళ్లి. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "శ్రీనివాస కళ్యాణం" అనే చిత్రాన్ని నిర్మిం

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (13:51 IST)
హీరో నితిన్‌కు హీరోయిన్‌ రాశిఖన్నాకు పెళ్లి జరిగింది. పెళ్లి అంటే నిజమైన పెళ్లి కాదండోయ్... సినిమాలో పెళ్లి. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "శ్రీనివాస కళ్యాణం" అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం వీరిద్దరూ అచ్చం పెళ్లి సీన్లో నటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిద్ధాం. 
 
హీరో నితన్‌తో నిర్మాత 'దిల్' రాజు చాలాకాలం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం "శ్రీనివాస కళ్యాణం". ఇందులో నితిన్ సరసన ముద్దుగుమ్మ రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 'శతమానం భవతి' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. 
 
ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా టైటిల్ లోగోతో పాటుగా పెళ్లి పీటలపై నితిన్, రాశిఖన్నా పెళ్లి సన్నివేశంతో కూడిన వీడియోను రిలీజ్ చేశారు. నితిన్, రాశిఖన్నా పెళ్లి జరుగుతుండగా 'శ్రీ శ్రీనివాసుడి కళ్యాణం..' అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. 
 
ఈ సీన్‌ను అచ్చం పెళ్లిలాగా నిర్వహించడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. మార్చి 4వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. దీంతో అచ్చం నిజం పెళ్లిలాగే ఈ సీన్‌ను చిత్రీకరించారు. దీంతో నిజంగానే నితిన్-రాశిఖన్నాలకు వివాహమైందా అనే కామెంట్స్‌ను నెటిజన్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments