రామ్ పోతినేని, బోయపాటి శ్రీను చిత్రంలో శ్రీలీల ఎంట్రీ

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (19:18 IST)
Sreeleela
మాసీవ్ బ్లాక్బస్టర్ 'అఖండ' చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.  
 
బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
 
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments