Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలదన్నేసిన "బాహుబలి" అవకాశం ఎంత విలువైనదో... ఆ నటీనటులకు ఓ గుణపాఠమా?

ఒక్కోసారి అద్భుతమైన అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతుంటాయి. కాలదన్నేసిన అవకాశం ఎంత విలువైనదో తెలిసి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడటం తప్ప వేరే మార్గం లేదు. లేకుంటే బాహుబలి వంటి భారతీయ చలనచిత్ర స్థాయిని ఎం

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (12:33 IST)
ఒక్కోసారి అద్భుతమైన అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతుంటాయి. కాలదన్నేసిన అవకాశం ఎంత విలువైనదో తెలిసి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడటం తప్ప వేరే మార్గం లేదు. లేకుంటే బాహుబలి వంటి భారతీయ చలనచిత్ర స్థాయిని ఎంతో పెంచేసిన బాహుబలి వంటి సినిమాలో నటించమంటే కాదు పొమ్మన్న వీరినేం అనాలో మీరే చెప్పండి...
 
మొదట రాజమాత శివగామి పాత్రకు రాజమౌళి అతిలోకసుందరి శ్రీదేవిని సంప్రదించారట. అప్పట్లో ఆ సినిమా స్థాయిని ఊహించలేకపోయిన ఆమె కాదు పొమ్మన్నారట. అప్పటికీ ఆశ చావని జక్కన్న తన గురువు, చిత్ర సమర్పకుడు అయిన రాఘవేంద్రునితో చెప్పించినా ఫలితం లేకపోయేసరికి శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ తెరపైకి వచ్చింది. అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకున్న రమ్యకృష్ణ ఆ పాత్రని ఎంత అద్భుతంగా రక్తి కట్టించిందో, ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే. అలానే దేవసేన పాత్రకు మొదట నయనతారని అనుకున్నారట. 
 
తెలుగుతో పాటు తమిళంలోనూ కొంత క్రేజ్ ఉన్నందున ఆమెని ఆ పాత్రకు తీసుకుందామని చిత్ర యూనిట్ భావించినా, రెండు సంవత్సరాలపాటు చిత్రీకరణ అనేటప్పటికి ఆమె వెనుకడుగు వేసిందని వినికిడి. ఇక అనుష్కని సంప్రదించడం, ఆమె ఓకే అనేయడం చకచకా జరిగిపోయాయి. లోయ కింద ఎక్కడో ఉన్న శివుడి క్యారెక్టర్‌ను తన అందంతో (సరిగ్గా చెప్పాలంటే పోగొట్టుకున్న మాస్క్‌తో) మహిష్మతి నగరానికి తీసుకొచ్చే కీలకమైన పాత్ర అవంతిక. 
 
ఈ పాత్రలో తమన్నా నటన కొద్దిగా విమర్శకుల పెన్నులకు, కీబోర్డులకు పనిచెప్పినా అంతో ఇంతో ప్రయత్నమైతే చేసింది. కానీ ఈ పాత్రకు అలనాటి బాలీవుడ్ హీరో అనిల్‌‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్‌ని సంప్రదించారట. కానీ ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, కొన్ని పోరాట సన్నివేశాలు ఉండటంతో తన వల్ల కాదని చేతులెత్తేసిందట ఆ అమ్మడు. 
 
ఇక కట్టప్ప పాత్ర గురించి ఐతే చెప్పనే అక్కర్లేదు. "వై కట్టప్ప కిల్డ్ బాహుబలి" అంటూ ఓ స్థాయిలో ప్రచారం పొందింది. సినిమా ఎంత పాపులర్ అయినా, ఎన్ని పాత్రలకు, గ్రాఫిక్స్‌కు ఎంత ప్రాచుర్యం లభించినా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఆ పాయింట్‌తో దేశవ్యాప్తంగా సత్యరాజ్ చాలా పాపులర్ అయిపోయాడు. కానీ ఆ పాత్రకు ముందుగా మోహన్‌లాల్‌ని సంప్రదించారట జక్కన్నగారు. ఆయన బిజీగా ఉండటం మూలంగా, కాల్షీట్ల సమస్యతో ఆ అదృష్టం సత్యరాజ్‌ను వరించింది. 
 
రాజమౌళి సినిమాల్లో విలన్‌కు ఉండే ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కర్లేదు. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందని నమ్మే అతికొద్దిమంది దర్శకుల్లో రాజమౌళి ఒకరు. కండలు తిరిగిన దేహం, చేతిలో గదతో భల్లాలదేవుడు చేసిన పోరాటవిన్యాసాలను, దేవసేనతో నగరం నడిబొడ్డులో పరాచికాలాడే సన్నివేశాలను ఎవరు మాత్రం మరిచిపోగలరు? కానీ రాణా కంటే ముందు ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని అనుకున్నారట విజయేంద్రప్రసాద్. 
 
హిందీ సినిమాలతో బిజీగా ఉన్న వివేక్ ఈ ఆఫర్‌కి నో చెప్పడంతో రాజమౌళి రాణాను సంప్రదించడం, హీరోగా చేసే సమయంలో విలన్ పాత్ర ఏంటా అని రాణా కొంచెం వెనుకాడినా, కొద్ది కాలంలోనే ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. ఆ విధంగా ఈ అత్యద్భుతమైన ప్రాజెక్టులో పాలుపంచుకోలేకపోయిన నటులందరూ ఇప్పుడు తీరిగ్గా విషాద గీతాలు పాడేసుకుంటూ కాలం గడిపేస్తున్నారట.... ఏప్రిల్ 28న విడుదల కాబోయే "బాహుబలి 2" కోసం ఎదురుచూస్తూ...
అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments