Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ ముఖంపై నిజంగానే ఉమ్మేసిన శ్రీదేవి.. రియాల్టీ కోసం?

శ్రీదేవి కెరీర్‌లో హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న సినిమా ''పదహారేళ్ల వయస్సు''. ఈ సినిమాలో సినీ లెజెండ్ కమల్ హాసన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నాయకుడు, ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించారు. ఇందులో హీరోయ

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (11:00 IST)
శ్రీదేవి కెరీర్‌లో హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న సినిమా ''పదహారేళ్ల వయస్సు''. ఈ సినిమాలో సినీ లెజెండ్ కమల్ హాసన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నాయకుడు, ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీదేవి కనిపించింది. ఈ చిత్రం దక్షిణాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీదేవి తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. 
 
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగ్ సమయంలో హీరో రజనీకాంత్ ముఖంపై శ్రీదేవి ఉమ్మివేయాల్సిన సన్నివేశం. ఆ సన్నివేశం చేసేందుకు శ్రీదేవి తొలుత నిరాకరించిందట. కానీ దర్శకుడితో పాటు రజనీకాంత్ ఇద్దరూ శ్రీదేవిని ఒప్పించినా.. సీన్ ఫర్ఫెక్ట్‌గా రాలేదట.
 
ఎన్ని టేకులు తీసినా ఫలితం లేదట. దీంతో రజనీ శ్రీదేవి వద్దకెళ్లి.. ''మీరు నా ముఖంపై నిజంగానే ఉమ్మేయండి.. ఏం పర్లేదు.. అప్పుడైతేనే సీన్ ఫర్ఫెక్టుగా వస్తుంది'' అని చెప్పారట. ఇక సన్నివేశం పండేందుకు శ్రీదేవి నిజంగానే రజనీకాంత్ ముఖంపై ఉమ్మేసిందట. ఇక ఈ సినిమా విడుదలయ్యాక అందరూ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకున్నారు. కానీ అనూహ్యంగా సూపర్ హిట్ అయ్యింది. శ్రీదేవి, కమల్, రజనీకాంత్ నటనకు మంచి గుర్తింపు లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments