Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె 12 ఏళ్లకే హీరోయిన్... కానీ కూతుళ్లు మాత్రం జడుసుకుంటున్నారు

ఆమె 12 ఏళ్ల వయసున్నప్పుడే హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె హీరోయిన్‌గా 50 ఏళ్ల ప్రస్థానం... ఆమె ఎవరో తెలుసా...? అతిలోక సుందరి శ్రీదేవి. ఐతే ఆమె కుమార్తెలు జాహ్నవి, ఖుషీ కపూర్ మాత్రం సినీ ఎంట్రీకి జడుసుక

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (15:36 IST)
ఆమె 12 ఏళ్ల వయసున్నప్పుడే హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె హీరోయిన్‌గా 50 ఏళ్ల ప్రస్థానం... ఆమె ఎవరో తెలుసా...? అతిలోక సుందరి శ్రీదేవి. ఐతే ఆమె కుమార్తెలు జాహ్నవి, ఖుషీ కపూర్ మాత్రం సినీ ఎంట్రీకి జడుసుకుంటున్నారు. ఎలా ఎంట్రీ ఇవ్వాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు. ఇకపోతే శ్రీదేవి సినీ ప్రస్థానం గురించి చూస్తే...
 
శ్రీదేవి.. వెండితెర అతిలోకసుందరి. ఈతరం హీరోయిన్లకు సైతం అసూయ పుట్టించేంత అందం ఆమె సొంతం. అందుకే ఆమె అర దశాబ్దం పాటు వెండితెరను ఏలుతోంది. బొద్దుగా ఉంటే ముద్దబంతి.. సన్నగా ఉంటే సన్నజాజి... ఈ నానుడి అచ్చం శ్రీదేవికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. 
 
తమిళుడు అయ్యప్పన్, అచ్చతెలుగు ఆడపడుచు రాజేశ్వరమ్మ దంపతులకు 1963 ఆగస్టు 13వ తేదీన ఈ అందాలదేవత జన్మించింది. ఆ తర్వాత నాలుగేళ్ళ వయసులోనే బాలనటిగా 1967లో వెండితెర అరంగేట్రం చేసింది. హీరోయిన్‌గా 12 యేళ్లకే ఎంట్రీ ఇచ్చింది. వచ్చే నెల 7వ తేదీతో ఆమె సినీరంగ ప్రవేశం చేసి 50 యేళ్లు. అదే రోజు శ్రీదేవి 300వ చిత్రం "మామ్" ప్రారంభంకానుంది. ఈ చిత్రంపై అపుడే భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
సాధారణంగా మహాఅయితే దశాబ్దకాలం పాటు హీరోయిన్‌గా కొనసాగడం మహాద్భుతం. అలాంటిది 35 యేళ్ళపాటు హీరోయిన్‌గా ఆమె కొనసాగింది. అలాగే, తండ్రీ తనయులతో నటించిన ఘనత శ్రీదేవికే దక్కింది. అలా స్టార్‌డమ్ కలిగిన శ్రీదేవి.. ఒక దేవతగా, అతిలోకసుందరిగా పిలిపించుకుంది. బాలీవుడ్ చిత్రం 'మిస్టర్ ఇండియా'తో మిస్ ఇండియా అని అనిపించుకుంది. ఈ సుందరాంగి సినీ కెరీర్‌కు జూలై 7వ తేదీతో 50 యేళ్లు పూర్తికానున్నాయి. దటీజ్ శ్రీదేవి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments