మానవా ఇక సెలవ్ అంటూ దేవకన్యలా ముస్తాబై శ్రీదేవి వెళ్లిపోయింది...

భూలోక అతిలోకసుందరి శ్రీదేవి ఇకలేరు. భూమిపై ఆమె ఇక కంటికి కనిపించరు. దేవకన్యలా ముస్తాబై దేవేరిలా పయనమై వెళ్లిపోయింది. కేవలం సినిమాల్లోనే కాదు.. నిజంగానే శ్రీదేవిని అంతిమయాత్ర కోసం దేవకన్యలా ముస్తాబు చే

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:02 IST)
భూలోక అతిలోకసుందరి శ్రీదేవి ఇకలేరు. భూమిపై ఆమె ఇక కంటికి కనిపించరు. దేవకన్యలా ముస్తాబై దేవేరిలా పయనమై వెళ్లిపోయింది. కేవలం సినిమాల్లోనే కాదు.. నిజంగానే శ్రీదేవిని అంతిమయాత్ర కోసం దేవకన్యలా ముస్తాబు చేశారు. ఎరుపు రంగు కంచిపట్టు చీరలో ఆమె సాక్షాత్తు అమ్మవారిలా కనిపించారు. ఆ తర్వాత తెలుపు రంగు పూలతో అలంకరించిన వాహనంపై దేవేరిలా పయనమై శ్రీదేవి వెళ్లిపోయింది. ఆమెను కడసారి వీక్షించేందుకు భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ముంబైకు క్యూకట్టారు. 
 
ఆమెకు అంతిమ వీడ్కోలులో అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య పాలుపంచుకున్నారు. ఏదో సినిమాలో ఓ పాటలో 'దేవతా తరలిపో... వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని' అని కవి పేర్కొన్నట్టు అభిమానులు, చిత్ర పరిశ్రమ కలిసి ఆమెను సాగనంపలేక అతి కష్టమ్మీద వీడ్కోలు పలికారు. ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే హిందూ శ్మశానవాటిక వరకు మొత్తం 7 కిలోమీటర్ల మేరకు అతిలోకసుందరి అంతిమయాత్ర సాగింది. 
 
అంతిమయాత్ర వాహనంలో బోనీకపూర్, బోనీ తొలి భార్య మోనా కపూర్ కుమారుడు అర్జున్ కపూర్, మేనల్లుడు మోహిత్ మార్వా తదితరులు ఉన్నారు. మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్ వెళ్లే శ్రీదేవి ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గౌరవ సూచకంగా ఆమె పార్థివదేహానికి త్రివర్ణ పతాకం కప్పారు.
 
ఇకపోతే, దర్శకుడు రాం గోపాల్ వర్మ అభిమానం.. ఆరాధన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మరణవార్తను జీర్ణించుకోలేక కొన్ని క్షణాలు గుండె ఆగినత పని అయిపోయింది. అనంతరం తన ఆవేదనను, బాధను నిరంతర ట్వీట్లతో వ్యక్తంచేస్తూ వచ్చారు. 
 
తాజాగా, మరో ట్వీట్ చేశారు. అందులో "సినీ దేవత అంతిమ మార్గం" అంటూ పేర్కొన్నారు. ఆ ట్వీట్ కింద శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారి శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఓ ఫొటోను జతచేశాడు. నవ్వుతున్న ఎన్టీఆర్ పక్కన చిన్నారి శ్రీదేవి నిలబడి ఉండటం ఈ ఫొటోలో కనపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments