Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కి నలుగురు సంతానం.. అందుకు అనర్హుడు: శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఏర్పడిన గతేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. రాజకీయ

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (14:25 IST)
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవికి ఏర్పడిన గతేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను 20 లేదా ముప్పైసార్లు చెప్పే నీవు.. రాజకీయాల్లో ఎలా రాణిస్తావంటూ ప్రశ్నించింది. 
 
పవన్ అదృష్టం బాగుండి ఏదో ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని.. ప్రజలను మోసం చేసేందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా.. అంటూ అడిగింది. మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి ఏమైందో గుర్తు లేదా? రేపటి రోజున నీ పరిస్థితి కూడా అంతేనని శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 
 
సీఎం కుర్చీకి ఆశపడి.. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. మెగాస్టార్‌కు ఏర్పడిన పరిస్థితేనని చెప్పింది. రాజ‌కీయాల్లో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే వారికి ఒక‌రు లేదా ఇద్ద‌రు సంతానం ఉండాలి.. అటువంటిది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నలుగురు సంతానం ఉన్నారు. అసలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డానికి అన‌ర్హుడంటూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments