Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిని చంపేందుకు కుట్ర.. సీసీటీవీ ఫుటేజ్ విడుదల.. అర్ధరాత్రి పూట?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (18:35 IST)
ఇప్పటికే... కాస్టింగ్ కౌచ్‌ల పేరిట టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసిన వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై ఇటీవల చెన్నైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం అనే ఫైనాన్షియర్ తన ఇంటికి వచ్చి తనను చంపేందుకు ప్రయత్నించాడని శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుని చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తూండగా.. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేసింది. 
 
అర్ధరాత్రి సమయంలో సుబ్రహ్యణ్యం కొంతమంది మనుషులతో శ్రీరెడ్డి ఇంటికి వచ్చినట్టు కనిపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్‌లను విడుదల చేసిన శ్రీరెడ్డి... తనకు అతనితో గల గొడవను వివరిస్తూ... గతంలో సుబ్రహ్మణ్యం అనే ఫైనాన్షియర్ హైదరాబాద్‌లో పెద్ద స్కామ్ చేశారనీ... దానికి సంబంధించిన కేసు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫైల్ అయ్యిందని.. ఇదే కేసులో సుబ్రహ్యణ్యం నాలుగు నెలలు శిక్ష అనుభవించి 15 రోజుల క్రితం జైలు నుండి విడుదలయ్యారని చెప్పుకొచ్చారు. తాను తమిళంలో చేస్తున్న ‘రెడ్డి డైరీస్’ చిత్రానికి ఫైనాన్స్ చేసింది కూడా అతనేనని చెప్పారు. 
 
‘రెడ్డి డైరీస్’ సినిమాలో తాను నటిస్తూండటం వల్ల గతంలో పోలీసుల విచారణకు తాను కూడా హాజరయ్యానన్నారు. దీంతో తానే పోలీసులకు పట్టించాననే కక్షతో తనను చంపేందుకు ప్రయత్నించాడని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తనపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందనీ.. అర్ధరాత్రి పూట తన ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాల్నీ ఆఫ్ చేసారని పేర్కొన్న శ్రీరెడ్డి... నిందితులు ముందే రెక్కీ నిర్వహించి.. చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనించిన మీదట... గేట్‌కి తాళం వేసి లోపలికి వచ్చారన్నారు. తాను లోపలికి వెళ్లి బెడ్ రూం లాక్ చేసుకున్నప్పటికీ పగలగొట్టే ప్రయత్నం చేసారనీ... దీంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వచ్చి వాళ్లని అరెస్ట్ చేసారన్నారు.
 
అయితే సుబ్రహ్మణ్యం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని.. పేర్కొన్న శ్రీరెడ్డి అయితే కేసును వెనక్కి తీసుకోవాలని తనను కొంతమంది తనను బెదిరిస్తున్నారనీ... తనది భయపడే స్వభావం కాదనీ ఆ ధైర్యంతోనే ఆధారాలతో కూడా సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేస్తున్నట్టు శ్రీరెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments