టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ దందా.. అమ్మాయిలకు ఇచ్చి అలా వాడుకుంటారు.. శ్రీరెడ్డి

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (11:11 IST)
బాలీవుడ్‌లో సుశాంత్ ఆత్మహత్య  కేసులో డ్రగ్స్ దందా బయటికి వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సుశాంత్ ప్రియురాలు రియాతో పాటు మరి కొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. రియా కూడా ఈ కేసులో మరో 25 మంది పేర్లను బయట పెట్టింది. కన్నడ పరిశ్రమలో కూడా ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌ని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసి ఇంకొంతమందికి నోటీసులు ఇచ్చారు. 
 
కంగనా ఇప్పటికే బాలీవుడ్‌లో కొంతంది డ్రగ్స్ వాడతారంటూ చెప్పింది. టాలీవుడ్‌లో కూడా చాలా మంది డ్రగ్స్ వాడతారంటూ ఇప్పటికే నటి మాధవీలత డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఈ డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్‌లోని డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. 
 
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని శ్రీరెడ్డి తెలిపారు. దేశ సినీ పరిశ్రమ ప్రతిష్టకు మచ్చ రాకుండా కేంద్రం చేపట్టిన దర్యాప్తుపై శ్రీరెడ్డి అభినందించింది. అలాగే టాలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీరెడ్డి ఆ వీడియో ద్వారా తెలిపింది.
 
ఇటీవల శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. టాలీవుడ్‍లో కొందరు మూవీ మాఫియాగా మారి చిన్న హీరోలను తొక్కేస్తున్నారని, వేషాలు ఎరవేసి అమ్మాయిలతో ఆడుకుంటున్నారని గతంలో చెప్పినట్లు శ్రీరెడ్డి గుర్తు చేసింది. అప్పట్లోనే డ్రగ్స్ గురించి కూడా తాను చెప్పానని తెలిపింది. చాలామంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలుసునని శ్రీరెడ్డి వెల్లడించింది. 
 
తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతానని, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments