Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరి మృతికి రాంగ్ ట్రీట్మెంటే కారణం.. న్యాయం కోసం..!?: శాంతి

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (15:33 IST)
విలక్షణ నటుడు శ్రీహరి అనారోగ్యంతో మరణించి రెండేళ్లు దాటిపోయింది. వరుస సినిమాలు చేస్తూనే అకస్మాత్తుగా ఆయన మరణించడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన సరైన చికిత్స ఇవ్వకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని ఆయన భార్య శాంతి ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీహరికి ప్రాణాపాయం ఉన్నంత అనారోగ్యం లేదని శాంతి చెప్పారు. మొదట్లో జాండిస్ ఉంటే.. అది కాస్త తగ్గుముఖం పట్టిందని.. ఆపై జ్వరం రావడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యారని శాంతి అన్నారు. కానీ చనిపోయేంత అనారోగ్యం లేదని సదరు ఆసుపత్రిలో జరిగిన చికిత్స వల్లే మరణించారన్నారు. 
 
ముంబైలో షూటింగ్‌లో ఉంటూ జబ్బుపడిన శ్రీహరిని అక్కడి లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ  ట్రీట్ మెంట్‌లో జరిగిన లోపాల వల్లే శ్రీహరి హఠాన్మరణం చెందారని శాంతి చెప్తున్నారు. ట్రీట్ మెంట్ విషయంలో తప్పు జరిగిందని.. ఈ విషయంపై న్యాయం జరుగుతుందని నమ్మకం లేకనే పోరాడలేదని శాంతి చెప్పారు. ఇద్దరు పిల్లలను పెట్టుకుని తాను కోర్టుల చుట్టూ తిరగలేకనే ఆ ఆసుపత్రిపై పోరాడలేదని శాంతి వివరించారు.
 
రాంగ్ ట్రీట్ మెంట్‌తో శ్రీహరి ముక్కులు, నోట్లో నుంచి బ్లడ్‌ వచ్చిందని.. మంచం మొత్తం బ్లడ్‌ అయ్యిందని.. ఏడుస్తున్నానని తనను దూరంగా ఉంచారని గుర్తుచేసుకుంటూ శాంతి కన్నీళ్లపర్యంతమయ్యారు. తనను డాక్టర్లు బ్లాక్‌మెయిల్‌ చేశారని వివరించారు. తమ ఫ్యామిలీకి క్లోజ్‌ అయిన ఓ మంత్రిగారి కొడుక్కు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments