Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి పెళ్లి గురించి నోరు విప్పింది.. ఆ వ్యక్తి వల్లే..? (video)

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:27 IST)
సీనియర్ యాంకర్ సుమ హోస్ట్‌గా చేస్తున్న శ్రీరామనవమి స్పెషల్ క్యాష్ ప్రోగ్రాంలో శ్రీముఖి పాల్గొంది. తాజాగా ఆ ప్రోగ్రాం ప్రోమో విడుదల చేశారు.
 
వీలైనంత వరకు శ్రీముఖి తన పర్సనల్ లైఫ్‌ని సీక్రెట్ గానే ఉంచుతుంది. కానీ తొలిసారి క్యాష్ ప్రోగ్రాంలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్ గురించి శ్రీముఖి చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైందని.. ఎంతో అందమైన హీరోలు, కో యాంకర్స్ తో వర్క్ చేశాను. కానీ ఎవ్వరికి నా మనసు ఇవ్వలేదు. పెళ్లి చేసుకోలేదు.
 
ఇప్పటికి ఆ మూడు ముళ్ళు వేయించుకోకుండా ఉండడానికి కారణం ఒక వ్యక్తి అని శ్రీముఖి తెలిపింది. ఆ వ్యక్తి పేరు చెప్పే లోపు ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే 9వ తేదీ ప్రసారం అయ్యే క్యాష్ ప్రోగ్రాం చూడాల్సిందే.
 
గతంలో శ్రీముఖి ఎవరో అజ్ఞాత వ్యక్తితో ప్రేమ బ్రేకప్ అయినట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీముఖి తన జాతి రత్నాలు టీం తో కలసి క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. నూకరాజు, ఇమ్మాన్యుయేల్, పంచ్ ప్రసాద్ వీరంతా శ్రీరామనవమి క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు. 
 
ఇకపోతే.. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. తాజాగా శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రీముఖి స్టన్నింగ్ పాత్రలో కనిపించి అలరించనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments