Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మాయిలు హానికరం కాదుకానీ.. పక్కలోకి పనికొస్తారు' : చలపతి రావు వెకిలి కూతలు

టాలీవుడ్‌లోని సీనియర్ నటుల్లో చలపతిరావు ఒకరు. ఈయన వేయని పాత్రంటూ లేదు. అలాంటి సీనియర్ నటుడు తాజాగా అమ్మాయిలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 'అమ్మాయిల హానికరమా' అని కార్యక్రమ వ్యాఖ్యా

Webdunia
సోమవారం, 22 మే 2017 (17:18 IST)
టాలీవుడ్‌లోని సీనియర్ నటుల్లో చలపతిరావు ఒకరు. ఈయన వేయని పాత్రంటూ లేదు. అలాంటి సీనియర్ నటుడు తాజాగా అమ్మాయిలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 'అమ్మాయిల హానికరమా' అని కార్యక్రమ వ్యాఖ్యాత ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఆయన ఎక్కడ.. ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో పరిశీలిద్ధాం.. 
 
అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రం ఆడియో వేడుకను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఘ‌నంగా జరిగింది. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ట్రైల‌ర్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ఉద్దేశించి చైతూ ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ ఓ డైలాగ్ చెపుతాడు. 
 
ఈ నేప‌థ్యంలో ఆ డైలాగ్‌పై అభిప్రాయాన్ని తీసుకుంటున్న ఓ యాంక‌ర్ చ‌ల‌ప‌తిరావు వ‌ద్ద‌కు వ‌చ్చి, 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా?' అని ప్ర‌శ్నించింది. పెద్ద వ‌య‌స్కుడైన చలపతి రావు అందుకు షాకింగ్ సమాధానం ఇచ్చారు. "అమ్మాయిలు హానికరం కాదుకానీ.. పక్కలోకి పనికి వస్తారంటూ" సమాధానమిచ్చారు. ఈ షాకింగ్ కామెంట్స్‌కు యాంకర్ బిత్తరపోయి నేరుగా వేదికపైకి వెళ్లిపోయింది. 
 
ఇపుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో అల‌జ‌డి రేపాయి. అలాగే, యువ‌తుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ప‌ట్ల సోష‌ల్ మీడియాలో యూజ‌ర్లు మండిప‌డుతున్నారు. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చలపతిరావులాంటి పరిశ్రమ పెద్దలు అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడటం తగదని  కామెంట్స్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments