Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్ కొత్త రికార్డు.. స్పైడర్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారట..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ''స్పైడర్'' విడుదలకు ముందే కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యేందుకు ఇంకా మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో కొత్త రికార్డు స్పైడర్ నమోదు చేసుకుంది.

Webdunia
బుధవారం, 5 జులై 2017 (18:46 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ''స్పైడర్'' విడుదలకు ముందే కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యేందుకు ఇంకా మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో కొత్త రికార్డు స్పైడర్ నమోదు చేసుకుంది. మ‌హేశ్ బాబు హీరోగా ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న "స్పైడ‌ర్" సినిమాకు చెందిన యూట్యూబ్ ఛాన‌ల్‌ను ఇప్ప‌టికే ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లు మాత్రమే విడుదలైన నేపథ్యంలో యూట్యూబ్‌లో స్పైడర్ ఛానల్‌కు భారీ క్రేజ్ వచ్చిందని ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. గూఢ‌చారి నేప‌థ్యంలో తీస్తున్న ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 
 
స్వల్పకాలంలోనే స్పైడర్ వీడియోకు, ఫోటోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ నమోదైనాయి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ రామోజీ రావు ఫిల్మ్ సిటీ గ్రాండ్ సెట్స్‌లో జరుగుతోంది. జూలై 5 నుంచి 8 వరకు ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న స్పైడర్ విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments