Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ నెంబర్ 150" ఆడియోలో స్పెషల్ టెక్నాలజీ.. రియలిస్టిక్‌గా ట్రైలర్, ఫోటోలు.. ప్రొడక్షన్ టీమ్ పక్కా ప్లాన్..?

మెగా ఫ్యాన్స్ ఆత్రుతతో ఎప్పుడెప్పుడా అని వేయి కనులతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా.. ఖైదీ నెంబర్ 150 విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇ

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (16:26 IST)
మెగా ఫ్యాన్స్ ఆత్రుతతో ఎప్పుడెప్పుడా అని వేయి కనులతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా.. ఖైదీ నెంబర్ 150 విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా కోసం అన్నయ్య 21 ఏళ్ల కుర్రాడిగా ఒళ్లు తగ్గించుకుని ముఖానికి రంగేసుకున్నాడు. ఇప్పటితరం హీరోలకు సైతం సవాలు విసిరే రీతిలో అందంగా తయారయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో మాస్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను స్పెషల్‌గా ఉండే రీతిలో ట్రై చేస్తున్నాడు. అందుకోసం ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ఉపయోగించని ఓ కొత్త టెక్నాలజీని వాడాలని ఫిక్సయ్యాడు.
 
ఈ చిత్ర ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఈ కొత్త టెక్నాలజీ వాడి అందరికీ షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్ర ఆడియో వేడుకలో త్రీడి హోలో గ్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి సినిమా ట్రైలర్స్, టీజర్స్, ఇతర దృశ్యాలు ప్రదర్శిస్తారట. ఈ టెక్నాలజీ ద్వారా ప్రదర్శింపబడేవి ఏవైనా రియలిస్టిక్‌గా కళ్ళముందు ఉన్నట్టే ఉంటాయట. అందుకే ఈ టెక్నాలజీని ట్రై చేయాలని ప్రొడక్షన్ టీమ్ భావిస్తోందట. 
 
మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం కాబట్టి ఆయన కుమారుడు చెర్రీతో పాటు ఖైదీ హోల్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా లక్ష్మీరాయ్ ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించినట్లు సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments