Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ఏక్ మినీ క‌థ`లో `సామిరంగా.` పాట‌కు విశేష స్పంద‌న‌

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:57 IST)
Ek Mini Katha
కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నిర్మిస్తున్న‌ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న `ఏక్ మినీ కథ` చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. `పేపర్ బాయ్` సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. ఈ మధ్యే విడుదలైన `ఈ మాయలో..` లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజాగా ఈ చిత్ర ఆడియో నుంచి మ‌రో పాట విడుద‌లైంది. `సామిరంగా` అంటూ సాగే ఈ పాట విడుద‌లైన అతి కొద్ది స‌మ‌యంలోనే సోష‌ల్ మీడియాలో విశేష స్పంద‌న అందుకుంటూ చాట్ బ‌స్ట‌ర్ గా మారింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
 
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
 
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments