Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్ళు వేసుకున్న నపుంసకుల్లామారిపోయిందని : ఎస్పీ బాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లామారిపోయిందని ప్రముఖ గాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం అన్నారు. . విజయవాడలో రోటరీ క్లబ్ తనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించి

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (15:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లామారిపోయిందని ప్రముఖ గాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం అన్నారు. . విజయవాడలో రోటరీ క్లబ్ తనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన సందర్భంగా ఎస్పీబీ మాట్లాడుతూ... మన తెలుగు సినిమాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బాలీవుడ్ చిత్రం 'దంగల్‌'ను అమీర్ ఖాన్ ఒక్కడే చేయగల్గుతాడా? అలాంటి సినిమాలను మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని ఆయన ప్రశ్నించాడు. ప్రతి ప్రేక్షకుడు, అభిమాని ఇలా ఆత్మవిమర్శ చేసుకోవాలని, జాతులు, కులాలు నేటి సినిమాలను నాశనం చేస్తున్నాయని అన్నారు. సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్ళు వేసుకున్న నపుంసకుల్లామారిపోయిందని.... సినిమాల్లో తమకు నచ్చని అంశంపై నోరెత్తితే ఏ ఫ్యాన్స్ వచ్చి ఇళ్ళపై రాళ్ళ వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోందన్నారు. 
 
తన మిధునం సినిమా విషయంలో తనకు ఓవర్సీస్ నుంచి కూడా గ్రీటింగ్స్ అందాయని, కానీ రాష్ట్రంలో చూస్తే 10 థియేటర్లకు మించి ప్రదర్శించలేకపోయారని బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చిన్న సినిమాలను బతికించాలి అని ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు అవార్డులను ఎగరేసుకుపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నామన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments