Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ! మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేక‌పోయాను - ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (17:15 IST)
NTR junior
హీరో ఎన్‌.టి.ఆర్‌. పుట్టిన‌రోజు మే 20. శుక్ర‌వారం. కానీ గురువారం అర్థ‌రాత్రి నుంచే జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న ఇంటికి అభిమానులు తండోప‌తండాలుగా విచ్చేశారు. విష‌యం తెలిసిన పోలీసు అధికారులు అక్క‌డికి వ‌చ్చి వారిని కంట్రోల్ చేశారు. శుక్ర‌వారం ఉద‌యం కూడా మ‌రింత‌గా అభిమానులు రావ‌డంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే క్ర‌మంలో చిన్న‌పాటి లాఠీ ఛార్జీ చేసినా ఎవ్వ‌రూ భ‌య‌ప‌డ‌క‌పోగా ఎన్‌.టి.ఆర్‌. జిందాబాద్ అంటూ నినాదాలు చేయ‌డం విశేషం.
 
ఉద‌య‌మే ఎన్‌.టి.ఆర్‌. ఇంటి పైనుంచి చూశార‌ని అక్క‌డి అభిమానుల్లో నెల‌కొంది. కానీ త‌ను ఇంటి వ‌ద్ద లేవ‌నీ అంటూ అభిమానుల‌కు, శ్రేయోభిలాషుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశాడు.
 
నా స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌కు, వెల్ విష‌ర్‌కూ, న‌న్ను చూడ‌డానికి వ‌చ్చిన ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌కు నేను హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. 
ముఖ్యంగా నా అభిమానుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ప్ర‌తిసారీ నా పుట్టిన‌రోజునాడు వివిధ ప్రాంతాల‌నుంచి వ‌చ్చే అభిమానుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.
 
మీ అంద‌రినీ నేను క‌లువ‌లేక‌పోయాను. అందుకు సారీ! చెబుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఇంటిలో లేను.
నాపై మీరు పెంచుకున్న ప్రేమ‌కు నేను దాసుడ్ని అయ్యాను. మీ గుండెలో స్థిర‌సాయిగా వుండేలా చేసిన మీ అంద‌రికీ మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. త్వ‌ర‌లో మీ అంద‌రినీ క‌లుస్తాను.. అంటూ పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments