Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ పుట్టిన రోజు.. కుప్పంలో రియల్ హీరోకి చిన్నారుల సెల్యూట్ (వీడియో)

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (15:47 IST)
Sonu Sood
తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే సోనూసూద్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. కరోనా సమయంలో ప్రజలకు ఆపద్భాంధవుడిగా నిలిచిన సోనూ సూద్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో సేవాకార్యక్రమాలతో ప్రేక్షకుల చేత దేవుడు అనిపించుకుంటున్నాడు. నేడు సోను పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులే కాదు రాజకీయ నేతలు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ట్విటర్లో విషెస్ తెలిపారు. 
 
"నువ్వు ఒకరికి సహయం చేస్తే వారి నుంచి వచ్చే దివేనలు నీకు ఇంకా సంతోషాన్ని ఇస్తాయని" అమ్మ మాటలే స్ఫూర్తిగా సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న సోనూసూద్‌కు పుట్టిన రోజు సందర్భంగా చిన్నారులు అద్భుతమైన కానుక ఇచ్చారు. 
 
ఈ గిఫ్టుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు సందర్భంగా నేలపై భారీ ఆకారాన్ని ఏర్పాటు చేశారు. కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 1200 విద్యార్థులు సోనూసూద్ ఆకారాన్ని నేలపై అద్భుతంగా మలచడంలో పాల్గొన్నారు. 
Sonu Sood
 
ఇకపోతే.. 1999లో సోనూసూద్ "కల్లగర్" సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 2009లో విడుదలైన ‘అరుంధతి’ సినిమా ఆయన క్రేజ్ ను పెంచేసింది. ఈ సినిమాలో పశుపతి అనే విలన్‌ పాత్రలో నటించి మెప్పించాడు. తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు సోనూ సూద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments